బిజెపి ఎంపీ జీవిఎల్ఎన్ రావుకు చేదు అనుభవం

April 18, 2019


img

బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహరావుకు ఈరోజు డిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన డిల్లీలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా హటాత్తుగా ఒక వ్యక్తి ఆయనపైకి తన బూటును విసిరాడు. కానీ అది ఆయనకు తగలలేదు. ఊహించని ఈ పరిణామంతో జీవిఎల్ నరసింహరావు షాక్ అయ్యారు. అక్కడే ఉన్న బిజెపి కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి కాన్పూర్ కు చెందిన శక్తి భార్గవ అనే వైద్యుడని పోలీసులు గుర్తించారు. ఈ దాడికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. అయితే షాక్ నుంచి తేరుకొన్న జీవిఎల్ నరసింహరావు ఇది తప్పకుండా కాంగ్రెస్‌ చేయించిన పనే అని ఆరోపించారు.    Related Post