తెలంగాణ పార్టీలకు ఈసీ జలక్

April 17, 2019


img

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చింది. 2013,14 సం.లలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసినవారిలో 12,745 మందిపై అనర్హత వేటు వేసింది. ఎన్నికల నియామావళి ప్రకారం ఎన్నికలు ముగిసిన 45 రోజులలోపుగా అభ్యర్ధులు తమ ఎన్నికల ప్రచారానికి అయిన ఖర్చుల వివరాలను సమర్పించవలసి ఉంటుంది. కానీ సమర్పించనందుకు వారిపై ఎన్నికల సంఘం ఈ కటినచర్య తీసుకొంది. అనర్హత వేటుపడిన 12,745 మంది 2021 జనవరి 23 వరకు ఏ ఎన్నికలలో కూడా పోటీ చేయకూడదని నిషేధం విధించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన మరియు ఓడిపోయిన అభ్యర్ధులలో అనర్హత వేటుపడినవారి సంఖ్య ఈవిధంగా ఉంది:  

1. నల్గొండ: 81 జెడ్పీటీసీలు 199 మంది ఎంపీటీసీలు.  

2. వరంగల్ అర్బన్: 7 జెడ్పీటీసీలు, 69 మంది ఎంపీటీసీలు.  

3. సిద్ధిపేట: 8 జెడ్పీటీసీలు, 67 మంది ఎంపీటీసీలు.

4. జయశంకర్ భూపాలపల్లి: 8 జెడ్పీటీసీలు, 76 మంది ఎంపీటీసీలు.

5. జనగామ: నలుగురు ఎంపీటీసీలు.

6. సూర్యాపేట: 55 జెడ్పీటీసీలు, 63 మంది ఎంపీటీసీలు. 

7. యాదాద్రి భువనగిరి: 32 జెడ్పీటీసీలు, 104 మంది ఎంపీటీసీలు. 

8. రాజన్న సిరిసిల్లా: 13జెడ్పీటీసీలు, 89 మంది ఎంపీటీసీలు.

9. కరీంనగర్‌: 32 జెడ్పీటీసీలు, 282 మంది ఎంపీటీసీలు.

10. పెద్దపల్లి: 31 జెడ్పీటీసీలు, 185 మంది ఎంపీటీసీలు. 

11. జగిత్యాల: 24 జెడ్పీటీసీలు, 141 మంది ఎంపీటీసీలు. 

12. 2014 పోటీ చేసిన జెడ్పీటీసీలు: 311 మంది              

13. 2014 పోటీ చేసిన ఎంపీటీసీలు: 1,331 మంది

14. 2013 గ్రామపంచాయితీ ఎన్నికలలో సర్పంచ్ పదవికి పోటీ చేసినవారు: 1,265 మంది. 

15.  2013 గ్రామపంచాయితీ ఎన్నికలలో వార్డు మెంబర్లుగా పోటీ చేసినవారు: 8,528 మంది. 

వీరిలో కొందరు ప్రస్తుతం పదవులలో ఉన్నారు. వారితో సహా మిగిలినవారిలో చాలా మంది మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. కానీ వారందరిపై అనర్హత వేటుపడటంతో 2021 జనవరి 23 వరకు పోటీ చేయలేరు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతున్న ఈ సమయంలో ఎన్నికల సంఘం ఒకేసారి 12,745 మందిపై అనర్హత వేటు వేయడం రాజకీయ పార్టీలలో ముఖ్యంగా ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. 


Related Post