కృష్ణాజిల్లాలో టిఎస్ఆర్టీసీ బస్సు బోల్తా

April 16, 2019


img

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా టిఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవరు, కండక్టరు మృతి చెందారు. మరో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు చాలా నిర్లక్ష్యంగా బస్సు డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టిందని ఆ బస్సు ప్రయాణికులు  చెప్పారు. విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకొని గాయపడినవారిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.     Related Post