పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు

April 13, 2019


img

తెలంగాణ రాష్ట్రం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్దం అవుతోంది. రాష్ట్రంలో 5857  ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలకు మూడు దశలలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈనెల 22 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టి వచ్చే నెల 14వ తేదీలోగా పూర్తి చేయబోతోంది. కనుక తదనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. వచ్చే నెల 6, 10, 14 తేదీలలో మూడు దశలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పరిషత్ ఎన్నికల ఫలితాలు మాత్రం మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే ప్రకటించబోతోంది.  Related Post