ఇంతకీ కిషన్‌రెడ్డి అనుమానం ఏమిటో?

April 13, 2019


img

సికిందరాబాద్‌ బిజెపి లోక్‌సభ అభ్యర్ధి కిషన్‌రెడ్డి శుక్రవారం సికిందరాబాద్‌ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 11న ఉదయం 7 గంటల నుంచి సికిందరాబాద్‌ నియోజకవర్గంలో పోలింగ్ మందకోడిగా సాగడంతో సాయంత్రం 4 గంటలవరకు 39 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది. గంటలలోపు హటాత్తుగా 6 శాతం పోలింగ్ జరగడంతో మొత్తం 45శాతం పోలింగ్ నమోదయ్యింది. కానీ సాయంత్రం 4-5 గంటల మద్య పోలింగ్ బూత్ లలో అతికొద్ది మంది ఓటర్లు మాత్రమే క్యూ లైన్లో ఉన్నప్పుడు ఏవిధంగా 6 శాతం పోలింగ్ జరిగిందని ప్రశ్నించారు. చివరి గంటసేపటిలో అన్ని పోలింగ్ బూత్ లకు భారీగా ఓటర్లు తరలివచ్చారని ఆ కారణంగానే హటాత్తుగా 6 శాతం పోలింగ్ జరిగిందని రిటర్నింగ్ అధికారి వివరణ ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. కానీ దీనిపై తమకు అనుమానాలున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

సాధారణంగా సాయంత్రం చల్లబడిన తరువాత ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వస్తుంటారు కనుక పోలింగ్ ముగిసేసమయానికి పోలింగ్ శాతం పెరుగుతుంటుంది. కానీ ఆ సమయంలో పోలింగ్ బూత్ లలో పెద్దగా జనం లేరని కిషన్‌రెడ్డి వాదిస్తున్నారు. అంటే రిగ్గింగ్ జరిగిందని భావిస్తున్నారనుకోవాలా?


Related Post