అప్పటి వరకు ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం

April 13, 2019


img

రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిదశలోనే ఎన్నికలు పూర్తయినప్పటికీ ఇతర రాష్ట్రాలలో మే 19 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. కనుక అప్పటి వరకు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు ప్రకటించడంపై నిషేధం విధించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అప్పటి వరకు ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించడం నేరంగా పరిగణించబడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి కేఎఫ్‌ విల్‌ఫ్రెడ్‌ తెలిపారు. 

ఈసారి ఆరు దశలలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున ముందుగా ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలలో ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు ఫలితాలు ప్రకటించినట్లయితే ఆ ప్రభావం పోలింగ్ జరుగబోయే ఇతర రాష్ట్రాలపై పడవచ్చుననే ఉద్దేశ్యంతో నిషేదం విధించింది. Related Post