రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు షురూ

April 12, 2019


img

గత ఏడాది సెప్టెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మొదలైన ఎన్నికల హడావుడి నిన్న లోక్‌సభ ఎన్నికలతో ముగిసిందనుకొంటే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మళ్ళీ సన్నాహాలు ప్రారంభించాయి. ఈ నెల 22వ తేదీ నుంచి మే 14లోగా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేయగా, ఎన్నికల సంఘం గ్రామీణ ప్రాంతాల ఓటర్ల జాబితాలను సిద్దం చేసి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కూడా తీసుకొంది. కనుక రాష్ట్రంలో 535 ఎంపీటీసీ, 5,857 జెడ్పీటీసీ స్థానాలకు త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడబోతోంది. ఈ ఎన్నికల ఫలితాలను మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 



Related Post