కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

April 12, 2019


img

తెరాసలో చేరిన నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, సంతోష్‌కుమార్‌, ఆకుల లలిత, దామోదర్‌ రెడ్డి తమను తెరాస శాసనమండలి పక్షంలో విలీనం చేయవలసిందిగా కోరుతూ అప్పటి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు లేఖ ఈయగా వారి అభ్యర్ధన మేరకు వారు నాలుగురినీ తెరాసలో చేర్చుకొన్నారు. మల్లేశ్వరరావు, బాలాజీ అనే ఇద్దరు న్యాయవాదులు ఈ ఫిరాయింపు వ్యవహారాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిని విచారణకు చేపట్టిన హైకోర్టు ఆ నలుగురు ఎమ్మెల్సీలకు, ప్రతివాదులుగా పేర్కొనబడిన మండలి ఛైర్మన్, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. దీనిపై 4 వారాలలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించి కేసును వచ్చే నెలకు వాయిదా వేసింది. Related Post