దళితుడికి అన్యాయం చేస్తారా కేసీఆర్‌? ఉత్తమ్ ప్రశ్న

March 23, 2019


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్న సిఎం కేసీఆర్‌, శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదాలేకుండా చేసి దళితుడైన మల్లు భట్టివిక్రమార్కకు సీఎల్పీ నేత హోదా కూడా లేకుండా చేస్తారా? దళితులకు అన్యాయం చేయడం తగునా? దళితుల పట్ల ఇంత చిన్న చూపు ఎందుకని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెరాసను గట్టిగా నిలదీస్తామని అవసరమైతే గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లకు ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

రాష్ట్రంలో తెరాస తప్ప మరో పార్టీ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందనే సంగతి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా అందరికీ తెలుసు. కానీ ఫిరాయింపుల వలన ఒక దళితుడికి అన్యాయం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం విశేషం. Related Post