భారత్‌ మొట్టమొదటి లోక్‌పాల్ జస్టిస్ పినాకి చంద్ర

March 23, 2019


img

భారత్‌ మొట్టమొదటి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి చంద్ర శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తదితరులు హాజరయ్యారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ పినాకి చంద్ర నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ లోక్‌పాల్‌ వ్యవస్థలో సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ జైన్‌, మహేంద్ర సింగ్‌, ఇందర్‌జీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌లను నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులుగా ఉంటారు. జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మహంతి, జస్టిస్‌ అభిలాషా కుమారి, జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠిలు జ్యుడిషియల్‌ సభ్యులుగా ఉంటారు.

కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు తదితరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు సైతం అవినీతి, కుంభకోణాలలో దోషులను శిక్షించలేకపోతున్నప్పుడు, సుప్రీంకోర్టు సమాంతరంగా ఏర్పాటైన ఈ లోక్‌పాల్ వ్యవస్థ ఏ మేరకు అవినీతిని అరికట్టగలుగుతుందో చూడాలి.


Related Post