పవన్‌ కల్యాణ్‌కు కేటీఆర్‌ ఘాటుగా జవాబు

March 23, 2019


img

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం ఉదృతస్థాయిలో జరుగుతోంది. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, సిఎం కేసీఆర్‌ను, తెరాసను ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆంధ్రా నాయకులకు గల ఆస్తులను స్వాధీనం చేసుకొంటామని తెరాస నేతలు బెదిరిస్తున్నారని, ఆంధ్రా ప్రజలను కొడుతున్నారని... తిడుతున్నారని ఆరోపిస్తున్నారు. అసలు ఆంధ్రా రాజకీయాలలో తెరాస ఎందుకు జోక్యం చేసుకొంటోందని ప్రశ్నిస్తున్నారు. తెరాసకు దమ్ముంటే నేరుగా ఏపీలో తెరాస అభ్యర్ధులను నిలబెట్టి పోటీ చేయించాలని సవాలు విసిరారు. ఏపీ ప్రజలను, నాయకులను చులకనగా చూస్తున్న కేసీఆర్‌తో సంబంధం పెట్టుకొన్న జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించాలని కోరుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌కు చేస్తున్న ఈ వ్యాఖ్యలు ప్రజలలో సెంటిమెంటు రగల్చడానికేనని అర్ధం అవుతోంది. పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ఈ ఆరోపణలపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. “పవన్‌ కల్యాణ్‌ మాటలు ప్రజలను తప్పుద్రోవ పట్టించేవిధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రాల ప్రజలు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ పవన్‌ కల్యాణ్‌కు వంటివారు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు,” అని ట్వీట్ చేశారు.Related Post