బిజెపిలో చేరిన గౌతమ్ గంభీర్

March 22, 2019


img

మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈరోజు బిజెపిలో చేరారు. డిల్లీలో కేంద్రఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గౌతమ్ గంభీర్‌ డిల్లీ నుంచి బిజెపి అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తీరు, ఆయన నాయకత్వ లక్షణాలను చూసే బిజెపిలో చేరుతున్నానని, తనను పార్టీలో చేర్చుకొన్నందుకు ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని గౌతమ్ గంభీర్‌ అన్నారు. 

దేశభద్రత, రక్షణ, విదేశీ వ్యవహారాలకు సంబందించి మోడీ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను సమర్ధిస్తూ ప్రధాని నరేంద్రమోడీ పట్ల గౌరవం, నమ్మకాన్ని చాటుకోనేవారు గౌతమ్ గంభీర్‌. కనుక బిజెపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం, ఆయన బిజెపిలో చేరడం చాలా సహజంగానే జరిగాయని చెప్పవచ్చు. Related Post