పవన్‌ కల్యాణ్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా?

March 22, 2019


img

దాదాపు 25 ఏళ్లుగా సినిమాలలో నటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ తెలుగు సినీ పరిశ్రమలో చెప్పక తప్పదు. హీరోలలో ఒకరు. కనుక ఆయన సినీపరిశ్రమలో బాగానే సంపాదించి ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. అయితే మన సినీ హీరో హీరోయిన్లు ఎంత సంపాదించుకొన్నారనే విషయం ఎవరికీ తెలియదు కానీ వారు ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టినప్పుడు ఆ వివరాలు బయటకు వస్తుంటాయి. 

పవన్‌ కల్యాణ్‌కు జనసేన స్థాపించి విశాఖపట్నంలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం రెండు చోట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు. ఆయన గురువారం గాజువాకలోని జీవీఎంసీ జోనల్‌ కార్యాలయానికి వచ్చి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. దానితో పాటు సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల వివరాలను కూడ పేర్కొన్నారు. అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు, అప్పుల వివరాలు: 

మొత్తం ఆస్తుల విలువ: రూ.52 కోట్లు 

వాటిలో స్థిరాస్తుల విలువ: 40.81 కోట్లు 

చరాస్తుల విలువ: రూ.12 కోట్లు

అప్పులు: 33.72 కోట్లు

భార్య  అన్నాలెజినోవా ఆస్తుల వివరాలు:

స్థిరాస్తులు: రూ.40 లక్షలు 

చరాస్తులు: రూ.30,50,112

పిల్లల పేర మొత్తం ఆస్తుల విలువ: రూ. 2.92 కోట్లు 


Related Post