జనసేనలోకి నాగబాబు...పోటీకి సై!

March 20, 2019


img

పవన్‌కల్యాణ్‌ కు మద్దతుగా అన్నయ్య నాగబాబు కూడా జనసేన పార్టీలో చేరారు. చేరడమే కాదు.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కూడా. పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు తాజా సమాచారం. పవన్‌కల్యాణ్‌ అదే జిల్లాలో భీమవరం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ లకు చాలా మంది అభిమానులున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒకే జిల్లా నుంచి పోటీ చేస్తుండటంతో జిల్లాపై జనసేన మరింత దృష్టిపెట్టి ఎన్నికల ప్రచారం చేస్తుంది కనుక టిడిపి, వైసీపీలకు జనసేన నుంచి గట్టి పోటీయే ఎదుర్కోవలసిరావచ్చు. మెగా బ్రదర్స్ కు మద్దతుగా చిరంజీవి, మెగా హీరోలు ప్రచారానికి వచ్చినట్లయితే అప్పుడు జనసేన-వైసీపీ-టిడిపిల మద్య త్రిముఖపోటీ రసవత్తరంగా మారుతుంది. Related Post