జెడి లక్ష్మినారాయణ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే...

March 19, 2019


img

సిబిఐలో పనిచేసినప్పుడు జాయింట్ డైరెక్టర్(జెడి) హోదాలో ఎంతో నిబద్దతతో పనిచేసి తెలుగు ప్రజలందరినీ ఆకట్టుకొన్న లక్ష్మినారాయణకు జెడి అనేది ఇంటి పేరుగా మారిపోయిందంటే అతిశయోక్తికాదు. లక్ష్మినారాయణ అంటే ఎవరూ గుర్తించలేరేమో కానీ జెడి లక్ష్మినారాయణ అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఇటీవల ఆయన జనసేనపార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక లోక్‌సభకు పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? అనే ప్రశ్నలకు ఈరోజు జనసేన జాబితాలో సమాధానం లభించింది. ఆయన విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నారు. అన్ని విధాలా అభివృద్ధి చెందిన విశాఖలో విధ్యాధికులు, ఉన్నతాధికారులు, ఇతర రాష్ట్రాలవారు, భారీ సంఖ్యలో పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఉన్నందున ఆయన విశాఖను ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన అభీష్టం మేరకు పవన్‌కల్యాణ్‌ ఆయనకు విశాఖ లోక్‌సభ టికెట్ ఖరారు చేశారు. Related Post