రెండు చోట్ల నుంచి పవన్‌కల్యాణ్‌ పోటీ

March 19, 2019


img

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విశాఖజిల్లాలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి శాసనసభకు పోటీ చేయనున్నారని ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఈనెల 25వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉన్నందున త్వరలోనే ఆయన రెండు చోట్లా నామినేషన్లు వేస్తారని తెలిపింది. పవన్‌కల్యాణ్‌ మొదట అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పారు. కానీ జనసేన, ఇతర పార్టీల బలాబలాలు పరిశీలించుకొని బేరీజు వేసుకొన్న తరువాత ఈ రెండు నియోజకవర్గాలలో విజయావకాశాలు బాగా ఉన్నాయని భావించి వీటిని ఎంచుకొన్నారు. కానీ ఈ రెండు నియోజకవర్గాలలో కూడా టిడిపి, వైసీపీలకు చెందిన బలమైన అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కనుక వారి నుంచి పవన్‌కల్యాణ్‌ గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు.     Related Post