తెరాసలో చేరిన క్రిశాంక్

March 19, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి క్రిశాంక్ సోమవారం కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరిపోయారు. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అల్లుడైన ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తానని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన క్రిశాంక్ లోక్‌సభ ఎన్నికల కోసం తయారుచేయించుకొన్న ఎన్నికల సామాగ్రిపై  పెట్రోల్ పోసి తగులబెట్టి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వెంటనే తన అనుచరులతో కలిసి కేటీఆర్‌ను కలిసి తెరాసలో చేరిపోయారు. ఆయనతోపాటు భూపాలపల్లి, వికారాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు తెరాస చేరిపోయారు. వారందరికీ కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. Related Post