అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో ముహూర్తం ఖరారు

March 18, 2019


img

హైటెక్ సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఒక శుభవార్త. ఎంతకాలంగానో వారు ఎదురుచూస్తున్న అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ కారిడార్‌లో ఈనెల 20వ తేదీ నుంచి మెట్రో రైల్ సేవలు ప్రారంభంకానున్నాయి. 11 కిమీ పొడవు ఉండే ఈ కారిడార్‌లో అమీర్‌పేట్‌ కాకుండా మొత్తం 8 మెట్రో స్టేషన్లు ఉంటాయి. అవి మధురానగర్, యూసఫ్ గూడా,  జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ స్టేషన్లు.

అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌సిటీకి బస్సులు, బైకులు లేదా ఆటోలలో చేరుకోవాలంటే ట్రాఫిక్ సమస్య కారణంగా కనీసం గంటకు పైగా సమయం పడుతోంది. కానీ మెట్రోలో కేవలం 18నిమిషాలలో చేరుకోవచ్చు కనుక అమీర్‌పేట్‌ నుంచి హైటెక్ సిటీ కారిడార్‌ వరకు మద్యలో గల ఐ‌టి కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు ఇది చాలా ఉపశమనం లభిస్తుంది.   

అలాగే నాగోల్ నుంచి అమీర్ పేట మీదుగా హైటెక్ సిటీకి నేరుగా మెట్రో సేవలు అందుబాటులోకి వస్తునందున నాగోల్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే ఉద్యోగులకు ఇది ఇంకా ఉపశమనంగా ఉంటుంది. వారు కేవలం 50-60 నిమిషాల వ్యవదిలోనే నాగోల్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు.


Related Post