తొలిరోజే నామినేషన్ వేసిన ఓవైసీ

March 18, 2019


img

ఈరోజు తొలిదశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఆ తరువాత వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. సాధారణంగా మొదటి రెండుమూడు రోజులు స్వతంత్ర అభ్యర్ధులు లేదా రెబెల్ అభ్యర్ధులే నామినేషన్లు వేస్తుంటారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మొదటిరోజునే నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న మాణిక్ రాజుకు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “నా నియోజకవర్గం అభివృద్ధికి, దానిలోని పేద, బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తాను,” అని చెప్పారు. Related Post