బంగ్లా క్రికెటర్స్ లక్ష్యంగా న్యూజిలాండ్‌లో కాల్పులు?

March 15, 2019


img

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్స్ లక్ష్యంగా శుక్రవారం కాల్పులు జరిగాయి. న్యూజిలాండ్‌లోని సెంట్రల్‌ క్రిస్ట్‌చర్చ్‌ సిటీలో హగ్లీపార్క్‌ వద్ద ఒక మసీదులోకి ఒక వ్యక్తి ప్రవేశించి తన వెంట తెచ్చుకొన్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. సెంట్రల్‌ క్రిస్ట్‌చర్చ్‌ సిటీలోనే గల మరో మసీదులో కూడా కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ రెండు ఘటనలలో ఎంతమంది గాయపడ్డారో...మృతిచెందారో వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. 

శనివారం నుంచి ప్రారంభం కాబోతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆడేందుకు అక్కడకు చేరుకొన్న బంగ్లాదేశ్ క్రికెటర్లు ప్రాక్టీసుకు ముందు దగ్గరలోనే ఉన్న మసీదులో ప్రార్ధనలు చేయడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. అయితే కాల్పుల శబ్ధం వినగానే వారందరూ వేరే మార్గం గుండా మసీదులో నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకొన్నారు. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని మసీదును చుట్టుముట్టి గాయపడినవారిని బయటకు తరలించి కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆ మైదానంలోనే పనిచేస్తుంటాడని ప్రత్యక్షసాక్షులు చెపుతున్నారు. రెండవ మసీదులో కాల్పులు జరిపిన వ్యక్తి వివరాలు తెలియవలసి ఉంది.


Related Post