జనసేన తొలి జాబితా విడుదల

March 14, 2019


img

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ బుదవారం రాత్రి నలుగురు లోక్‌సభ అభ్యర్ధులు, 32 మంది శాసనసభ అభ్యర్ధుల పేర్లతో తొలి జాబితానువిడుదల చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, అమాలాపురం లోక్‌సభ స్థానాలకు, అన్ని జిల్లాలలో కలిపి 32 శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించారు. 

శాసనసభ అభ్యర్ధులలో నాదెండ్ల మనోహర్ (తెనాలి), తోట చంద్రశేఖర్ (గుంటూరు పశ్చిమ), రావెల కిషోర్ బాబు (పత్తిపాడు), పసుపులేటి సుధాకర్ (కావలి), బండి రామకృష్ణ (మచిలీపట్నం) తదితర ప్రముఖులున్నారు. 

ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో  పోరాడుతానని చెప్పిన పవన్‌కల్యాణ్‌ గత ఎన్నికల తరువాత మళ్ళీ సినిమాలు చేసుకొంటూ అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తీరు పట్ల ప్రజలలో అసహనం కనబడేది. కానీ సుమారు ఏడాది క్రితం సినిమాలకు గుడ్-బై చెప్పేసి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ నిర్మాణం చేసుకొని ఎన్నికలపై దృష్టి పెట్టి పని చేస్తూ రాజకీయాలలో నిలకడగా ఉంటాననే నమ్మకం ప్రజలకు కలిగించారు. దాంతో ఆయన అభిమానులు చాలా సంతోషించారు. ఆ కారణంగానే టిడిపి, బిజెపిలకు చెందిన కొందరు ప్రముఖ నేతలు కూడా జనసేనలో చేరారు. ఇంకా చేరే అవకాశం ఉంది. ఇప్పుడు అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించి జనసేన పార్టీ ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకొని పోటీ చేస్తోందనే బలమైన సంకేతం ఇచ్చారు.


Related Post