కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి కామెంట్స్

March 13, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా ఓటమిపాలవడంతో కొన్ని రోజులు మౌనం వహించినప్పటికీ, లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో మళ్ళీ తనదైన శైలిలో సిఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. 

బుదవారం సీఎల్పీ కారాయలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ‘వార్ జోన్’లో ఉన్నాయి. గెలిచినా, ఓడినా ఈ సమయంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి వారిలో ధైర్యం నింపవలసిన భాధ్యత మావంటి నాయకులదే. పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటించి ఎటువంటి బాధ్యత అప్పగించినా, ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను. మా కాంగ్రెస్ పార్టీ టెండూల్కర్ వంటిదైతే, సిఎం కేసీఆర్‌ గచ్చిబౌలి దివాకర్ (గల్లీ క్రికెటర్) వంటివాడు. మా పార్టీ అవసరం పడినప్పుడు సాంప్రదాయాలు, ఆనవాయితీల పేరిట మద్దతు తీసుకొంటారు కానీ ఆయనకు సాంప్రదాయాలు, ఆనవాయితీలను పాటించే అలవాటు లేదు. ఉంటే నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను నిలబెట్టి ఉండేవారేకాదు,” అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. 

రేవంత్‌ రెడ్డితో సహా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన పలువురు కాంగ్రెస్‌ నేతలు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దం అయ్యి తమ ప్రాధాన్యతలను పార్టీ అధిష్టానానికి ఎప్పుడో వివరించారు. ఆ ప్రకారమే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో జాబితా సిద్దం అయ్యింది. అయితే ఆ జాబితాలో రేవంత్‌ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో పేర్కొనలేదు. కానీ ఆయన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడం తధ్యం. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడితే రేవంత్‌ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో స్పష్టం అవుతుంది. కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ తయారు చేసి కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపిన జాబితా ఈవిధంగా ఉంది. 

మల్కాజ్‌గిరి: కూన శ్రీశైలంగౌడ్‌/బండ కార్తీకరెడ్డి;

హైదరాబాద్‌: అజారుద్దీన్‌/ఫిరోజ్‌ఖాన్‌;

సికింద్రాబాద్‌: అంజన్‌కుమార్‌ యాదవ్‌/ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి;

మెదక్‌: గాలి అనిల్‌కుమార్‌

చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి;

కరీంనగర్‌: పొన్నం ప్రభాకర్‌/ నేరెళ్ల శారద;

నాగర్‌కర్నూలు: సంపత్‌/మల్లురవి;

వరంగల్‌: డాక్టర్‌ రాజమౌళి/విజయ్‌కుమార్‌ మాదిగ; 

నల్లగొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి/పద్మావతిరెడ్డి/పటేల్‌ రమేశ్‌రెడ్డి/రఘువీర్‌రెడ్డి;

భువనగిరి: కసిరెడ్డి నారాయణరెడ్డి/గూడూరు నారాయణరెడ్డి/వంగాల స్వామిగౌడ్‌;

ఖమ్మం: రాజేంద్రప్రసాద్‌/వి.హనుమంతరావు/రేణుకాచౌదరి/ పొంగులేటి సుధాకర్‌రెడ్డి/గాయత్రి రవి.

పెద్దపల్లి: కవ్వంపల్లి సత్యనారాయణ/ఊట్ల వరప్రసాద్‌;

నిజామాబాద్‌: మధుయాష్కీ;

మహబూబ్‌నగర్‌: ఎస్‌.జైపాల్‌రెడ్డి/వంశీచంద్‌రెడ్డి;

ఆదిలాబాద్‌: నరేశ్‌ జాదవ్‌/ సోయం బాపూరావు;

మహబూబాబాద్‌: బలరాం నాయక్‌/రాములు నాయక్‌;

జహీరాబాద్‌: మదన్‌మోహన్‌/జైపాల్‌రెడ్డి (బాగారెడ్డి తనయుడు).


Related Post