వైసీపీలోకి మరో సినీ నటుడు

March 13, 2019


img

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సినీ పరిశ్రమ నుంచి వైసీపీలోకి చేరేవారి సంఖ్య పెరుగుతోంది. జయసుధ, అలీ తరువాత ఇవాళ్ళ సినీ నటుడు దగ్గుబాటి రాజా రవీంద్ర జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదల, పోరాటస్ఫూర్తిని చూసి నేను చాలా ప్రేరణ పొందాను. అందుకే వైసీపీలో చేరాను. త్వరలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. ఈసారి ఎన్నికలలో వైసీపీ తప్పకుండా గెలుస్తుంది. జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అవుతారు,” అని అన్నారు. Related Post