లక్ష్మణ్ కూడా అదే ప్రశ్న..

March 13, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలువంచి తెలంగాణకు అన్ని సాధించుకొస్తామని కేటీఆర్‌ చేస్తున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికలలో గెలవడం కోసం చేస్తున్న జిమ్మీక్కుగా కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అభివర్ణించారు. 15 మంది ఎంపీలు ఉన్నప్పటికీ గత నాలుగున్నరేళ్ళలో ఏమీ సాధించలేకపోయిన తెరాస, ఇప్పుడు మరొక్క సీటు ఆధనంగా గెలుచుకొంటే ఏమీ సాధించగలదు?” అని పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ కూడా అదేవిధంగా ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “16 ఎంపీ సీట్లు గెలిస్తే డిల్లీలో చక్రం తిప్పుదామని కేటీఆర్‌ పగటికలలు కంటున్నారు. డిల్లీలో చక్రం కాదు కదా కనీసం బొంగరం కూడా తిప్పలేరు. మళ్ళీ నరేంద్రమోడీయే ప్రధానమంత్రి కాబోతున్నారు. మోడీ ప్రధాని అయితే కేటీఆర్‌ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్దామేనా? తెరాసకు ప్రస్తుతం 15మంది ఎంపీలున్నారు. వారితో గత నాలుగున్నరేళ్ళలో తెరాస ఏమి సాధించిందో చెప్పాలి. అప్పుడు సాధించలేనిది ఇప్పుడు మరో సీటు ఎక్కువ లభిస్తే ఏమి సాధిస్తుంది? ఏవిధంగా సాధిస్తుందో చెప్పాలి. 

తెరాస దారుసలాం (మజ్లీస్ కార్యాలయం)లో బందీ అయ్యింది. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒక రాజకీయ బ్రోకరులాగ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తీసుకువచ్చి తెరాసలో చేర్పిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలో మాపార్టీ రాష్ట్రంలోని 17 స్థానాలలోనూ పోటీ చేసి తెరాసను మట్టి కరిపిస్తుంది. ప్రాంతీయ పార్టీ అయిన తెరాసకు లోక్‌సభ ఎన్నికలతో సంబందం లేనప్పటికీ డిల్లీలో చక్రం తిప్పుతామంటూ చాలా హడావుడి చేస్తోంది. త్వరలోనే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు రాష్ట్రంలో పర్యటించి లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు,” అని అన్నారు. 


Related Post