చివరి నిమిషంలో ఈటలకు ఆహ్వానం

February 19, 2019


img

సోమవారం సాయంత్రం మీడియా చేతికి వచ్చిన మంత్రుల జాబితాలో ఈటల రాజేందర్ పేరు లేదూ. కానీ రాత్రి 10 గంటలకు ఈటల కూడా నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే సమాచారం అందింది. మొదట తొమ్మిది మంది ఎమ్మెల్యేలకే సిఎం కార్యాలయం నుంచి ఫోన్లో ఆహ్వానాలు అందాయి. వారిలో ఈటల రాజేందర్‌ లేరు. దాంతో ఈసారి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొంటారా లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ రాత్రి 10గంటలకు సిఎం కార్యాలయం నుంచి ఈటల రాజేందర్‌కు కూడా ఆహ్వానం వచ్చింది. కనుక ఆయనతో కలిపి మొత్తం 10 మంది నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.


Related Post