మంత్రులు-శాఖలు ఇవే...నా?

February 18, 2019


img

మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి శాఖల కేటాయింపు కూడా చేసినట్లు తెలుస్తోంది. సాగునీరు, పంచాయతీరాజ్, పరిశ్రమలు, మున్సిపల్ తదితర ముఖ్యమైన కొన్ని శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అట్టేబెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రులు వారి శాఖలు ఈవిధంగా ఉండవచ్చు. 

తలసాని శ్రీనివాస్ యాదవ్: పశుసంవర్ధక శాఖ 

జగదీశ్వర్ రెడ్డి: విద్యా మరియు విద్యుత్ శాఖలు

ఇంద్రకరణ్ రెడ్డి: వైద్య, ఆరోగ్యశాఖలు    

శ్రీనివాస్ గౌడ్: ఎక్సైజ్ మరియు సంక్షేమ శాఖలు

నిరంజన్ రెడ్డి: ఆర్ధికశాఖ

ప్రశాంత్ రెడ్డి: వ్యవసాయం మరియు మార్కెటింగ్ శాఖ 

ఎర్రబెల్లి దయాకర్ రావు: రోడ్లు భవనాల శాఖ 

మల్లారెడ్డి: రవాణా శాఖ 

కొప్పుల ఈశ్వర్: శాఖను కేటాయించవలసి ఉంది. 

లోక్‌సభ ఎన్నికల తరువాత మరో ఆరుగురితో మరోసారి మంత్రివర్గ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్ వంటి సీనియర్లను రేపు మంత్రివర్గంలో తీసుకోనట్లయితే అది చాలా ఆలోచించవలసిన విషయమే అవుతుంది. రేపు ప్రమాణస్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కనుక మరికొన్ని గంటలలోనే మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడబోతోంది.


Related Post