ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

February 18, 2019


img

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కనుక రెండు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. 

నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 21 నుంచి 28వరకు

నామినేషన్ల పరిశీలన: మార్చి 1వ తేదీ     

నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 5వ తేదీ

పోలింగ్: మార్చి 15వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. 

పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. 

పదవీకాలం పూర్తి చేసుకొన్న ఎమ్మెల్సీలు:

తెలంగాణ: పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహమూద్ అలీ, మహమ్మద్ సలీం, టి.సంతోష్ కుమార్. 

ఆంధ్రప్రదేశ్: యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, పి.శమంతకమణి, ఏ. లక్ష్మీ శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావు. 


Related Post