ఆ రెండు ప్రాజెక్టులకు భూకేటాయింపులు

February 18, 2019


img

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు కేంద్రఅటవీ మరియు పర్యావరణశాఖ నుంచి రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేసినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా శనివారం సాయంత్రం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

వాటిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట అటవీడివిజన్ పరిధిలోని 204 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఆ ప్రాంతంలో పంప్‌హౌస్‌లు, నార్లాపూర్ జలాశయం, నార్లాపూర్-ఏదుల జలాశయాల మధ్య సొరంగం పనుల కోసం వినియోగిస్తారు. 

సీతారామ ప్రాజెక్టు కోసం భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలోని 1531 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించింది. కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, పాల్వంచ, ఖమ్మం అటవీ డివిజన్ల పరిధిలో కేటాయించిన భూమిలో కాల్వలు, సొరంగాల తవ్వకం, విద్యుత్ లైన్ల కోసం వినియోగిస్తారు. పర్యావరణ అనుమతులు లభించి, భూకేటాయింపులు కూడా జరిగాయి. ఈసారి సాగునీటి శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అట్టేబెట్టుకొని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే  బడ్జెట్ కేటాయింపులు కూడా చేయనున్నారు. కనుక ఇకపై ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణపనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. 



Related Post