ఆ షో నుంచి సిద్దూ అవుట్

February 16, 2019


img

మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు పుల్వామా దాడిపై పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురవడంతో సోనీ టీవీలో ప్రసారం అవుతున్న ‘ది కపిల్ శర్మ షో’ నుంచి తొలగించబడ్డారు. పుల్వామా దాడిపై సిద్ధూ ఎమ్మన్నారంటే, “యుద్ధసమయంలో ఇటువంటి ఘటనలు (ఉగ్రదాడులు) జరుగుతుంటాయి. అదే సమయంలో సమాంతరంగా చర్చలు కూడా జరుగుతుంటాయి. ఉగ్రవాదులకు కులం, మతం, ప్రాంతాలతో సంబందం ఉండదు. ప్రతీదేశంలో మంచి మనుషులు, దుర్మార్గులు ఉంటారు. అంతా మాత్రన్న యావత్ దేశాన్ని ప్రజలను నిందించలేము. దుర్మార్గులను తప్పక శిక్షించాలి. పాము కాటుకు పాము విషంతో తయారుచేసిన మందే విరుగుడుగా పని చేస్తుందని అందరికీ తెలుసు,” అని అన్నారు.

సిద్దూ చెప్పింది నిజమే కావచ్చు. కొందరు ఉగ్రవాదులు చేసిన ఈ దుర్మార్గపు చర్యకు యావత్ పాక్ ప్రజలను తప్పు పట్టడం సరికాదు కానీ పుల్వామా దాడితో భారతీయులు తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నప్పుడు సిద్దూ మాట్లాడిన ఆ మాటలు పాకిస్థాన్‌ను వెనకేసుకువస్తున్నట్లున్నాయి. అందుకే సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ సిద్ధూ’, ‘బాయ్ కాట్ ది కపిల్ శర్మ షో’, ‘బాయ్ కాట్ సోనీ టీవి’ అంటూ హ్యాష్ ట్యాగ్స్ తో సిద్దూపై నెటిజన్స్ తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కపిల్ శర్మ షో సూపర్ హిట్ కావడానికి సిద్దూ కూడా కారణమే అయినప్పటికీ అతనిని కొనసాగించినట్లయితే ప్రజాగ్రహానికి గురి కావలసివస్తుందనే భయంతో సోనీ టీవీ యాజమాన్యం సిద్ధూని ఆ షో నుంచి తప్పించింది. 


Related Post