తెలంగాణలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్

February 15, 2019


img

రాష్ట్రంలో రేపటి నుంచి నారాయణపేట, ములుగు కొత్త జిల్లాలు ఏర్పాటుకాబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటు కోసం గత ఏడాది డిసెంబరు 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసి సంబందిత ప్రాంతాలలోని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించింది. తదనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నేడు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. కనుక రేపటి నుంచి నారాయణపేట, ములుగు జిల్లాలుగా ఆవిర్భవిస్తాయి. వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలవుతాయి. రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీ, రెవెన్యూ తదితర ఉన్నతాధికారులను ప్రభుత్వం నియమించవలసి ఉంది. అలాగే జిల్లాలలో సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వగైరా భావనా సముదాయాలను నిర్మించవలసి ఉంది. 



Related Post