మంత్రివర్గం విస్తరణకు కొత్త ముహూర్తం?

February 12, 2019


img

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి సరికొత్త ముహూర్తం కుదిరింట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈనెల 16వ తేదీన (ఏకాదశి)మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గంతో పాటు 16 మంది ఎమ్మెల్సీ, 16 మంది లోక్‌సభ అభ్యర్ధుల పేర్లను కూడా ఆదేరోజున సిఎం కేసీఆర్‌ ప్రకటించబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏ పనినైనా ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌ నుంచే శ్రీకారం చుట్టే సిఎం కేసీఆర్‌ ఈ పని మీదే ఇప్పుడు అక్కడకు వెళ్ళారని కనుక ఫిబ్రవరి 16న మంత్రివర్గ విస్తరణ ఖాయమని తెరాసలో అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి వస్తున్న ఈ వార్తలు ఈసారైనా నిజమవుతాయో లేదో చూడాలి.    Related Post