హైస్పీడ్ ట్రైన్ టికెట్ ధరలు ఖరారు

February 11, 2019


img

దేశంలోని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల కంటే వేగంగా గంటకు 180 కిమీ ప్రయాణించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈనెల 15వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ డిల్లీలో పచ్చజెండా ఊపి ప్రారంభించబోతున్నారు. దాని టికెట్ ధరలను రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది. 

ఏసీ చైర్ కార్: రూ.1,850, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ. 3, 520గా నిర్ణయించింది. వీటి రిటర్న్ టికెట్ ధర రూ.1,795, రూ.3,470గా నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాన్పూర్ లేదా ప్రయాగ్ రాజ్ నుంచి లేదా వరకు ప్రయాణించేవారు రూ.122, రూ.155 చెల్లించవలసి ఉంటుంది.

ఈ హైస్పీడ్ రైలులో టికెట్ల ధరలే కాదు...ఆహారం ధరలలో కూడా కొంత వ్యత్యాసం ఉంది. డిల్లీ-బనారస్ మద్య ఏసీ చైర్ కార్ ప్రయాణికులు టీ, కాఫీ,  టిఫిన్, భోజనం కలుపుకొని రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ప్రయాణికులు రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. డిల్లీ-బనారస్ (కాశీ) మద్య తిరిగే ఈ హైస్పీడ్ రైలు మద్యలో కాన్పూర్, ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) స్టేషన్లలో మాత్రమే అగుతుంది. 

 గంటకు 180 కిమీ వేగంతో ప్రయాణించే ఈ హైస్పీడు రైలు బనారస్-న్యూడిల్లీ మద్య 752 కిమీ దూరాన్ని కేవలం 8 గంటలలోనే అధిగమిస్తుంది. ఈ ఇంజన్ రహిత హైస్పీడు రైలులో మొత్తం 16 ఏసీ బోగీలు ఉంటాయి. ఈ రైలు డిల్లీలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.00 గంటలకు బనారస్ చేరుకొంటుంది. మళ్ళీ రాత్రి 2.30 గంటలకు బనారస్ లో బయలుదేరి ఉదయం 10.30 గంటలకు డిల్లీ చేరుకొంటుంది.


Related Post