హరీష్ రావు అర్ధాంగి రాజకీయాలలోకి?

February 11, 2019


img

సిఎం కేసీఆర్‌ అన్న కూతురు, తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆర్. రమ్యారావు ఈరోజు ఒక సంచలన విషయం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాట్స్ అప్ గ్రూపులో ‘తాజా తెలంగాణ’ వార్త పేరుతో “మరో 4 నెలలలో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో తన్నీరు శ్రీనిత (హరీష్ రావు అర్ధాంగి) పోటీ చేయనున్నారు,” అని మెసేజ్ పోస్ట్ చేశారు. రమ్యారావుకు హరీష్ రావు మేనత్త కొడుకు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆమె కూడా కేసీఆర్‌ పరివారంలో ఒకరు కనుక ఆమె చేసిన ఈ ప్రకటనను కేవలం రాజకీయ దురుదేశ్యంతో చేసిన ప్రకటనగా కొట్టిపడేయలేము. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా సిఎం కేసీఆర్‌ ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తుండటం కూడా ఆమె మాటలను బలం చేకూర్చుతున్నట్లుంది. రమ్యారావు ప్రకటనపై హరీష్ రావు ఇంకా స్పందించవలసి ఉంది. అప్పుడే నిజానిజాలు తెలుస్తాయి. Related Post