నేడు డిల్లీలో చంద్రబాబు ధర్మపోరాటదీక్ష

February 11, 2019


img

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం డిల్లీలో ఏపీ భవన్ వద్ద ధర్మపోరాటదీక్ష చేయబోతున్నారు. రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగా ఒక్కరోజు దీక్ష చేయబోతున్నారు. దీక్షలో పాల్గొనేందుకు చంద్రబాబు ఆదివారం రాత్రి 11.30 గంటలకు డిల్లీ చేరుకొన్నారు. ముందుగా ఉదయం 6.30 గంటలకు రాజ్ ఘాట్ వెళ్ళి మహాత్మాగాందీకి నివాళి ఆర్పిస్తారు. అనంతరం ఏపీ భవన్ చేరుకొని అక్కడ అంబేడ్కర్ నివాళి అర్పించి 8 గంటలకు ధర్మపోరాటదీక్ష ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటలకు దీక్ష ముగింపు సందర్భంగా దీక్షకు హాజరైనవారిని ఉద్దేశ్యించి చంద్రబాబు ప్రసంగిస్తారు. 

డిల్లీలో నేడు చంద్రబాబు చేయబోతున్న ధర్మపోరాటదీక్షలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు, పలు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకాబోతున్నారు. రాష్ట్రం నుంచి పలు విద్యార్ధి, యువజన సంఘాలు, ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న పలు సంఘాలు కూడా ఈరోజు దీక్షలో పాల్గొనబోతున్నాయి. 

ప్రధాని నరేంద్రమోడీ నిన్న గుంటూరు సభలో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం భారీగా నిధులు అందజేస్తున్నప్పటికీ, వాటికి లెక్కలు అడిగితే చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పైగా ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. కానీ చంద్రబాబునాయుడు ఎన్ని దీక్షలు చేసినా ఓడిపోవడం ఖాయం,” అని అన్నారు.


Related Post