మంత్రివర్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు?

February 08, 2019


img

తెలంగాణ మంత్రివర్గం ఏర్పాటుకు సిఎం కేసీఆర్‌ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈనెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో 8-9 మంది మాత్రులు ప్రమాణస్వీకారం చేయవచ్చునని తెలుస్తోంది. ఆరోజు పవిత్రమైన మాఘమాస వసంత పంచమి కనుక మంత్రివర్గం ఏర్పాటుకు ఆ ముహూర్తన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మంత్రిపదవులు చేపట్టబోతున్న వారిలో మాజీ మంత్రులు ఈటల రాజేందర్, జి.జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నట్లు సమాచారం. కొత్తగా మంత్రిపదవులు పొందబోతున్న వారిలో మాజీ డెప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, రెడ్యా నాయక్, నిరంజన్ రెడ్డి లేదా ప్రశాంత్ రెడ్డి ఉండవచ్చని సమాచారం.  Related Post