శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగం

January 19, 2019


img

ఈరోజు శాసనసభలో గవర్నర్ నరసింహన్ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం క్లుప్తంగా:

1. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి అభివృద్ధికి గత నాలుగున్నరేళ్ళలో విశేష కృషి చేసింది. నీటిపారుదల రంగంలో రూ. 77,777 కోట్లు ఖర్చు చేసింది. రాబోయే ఐదేళ్ళ రూ. 1.17 లక్షల కోట్లు ఖర్చు చేయబోతోంది.

2. దేశంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రంలో తెలంగాణ మాత్రమే.

3. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటపెట్టుబడి, రైతులకు జీవిత భీమా పధకాలకు దేశవిదేశాలు సైతం మెచ్చుకున్నాయి. 

4. గొర్రెలు, చేపల పెంపకం వంటి కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

5. తెలంగాణ ఏర్పడిన కొన్ని నెలలకే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించింది.

6. మిషన్ కాకతీయ, భగీరధ పధకాలు దేశానికే ఆధార్శంగా నిలిచాయి. సత్ఫలితాలు ఇస్తున్నాయి.

7. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు అందుకొంది.

8. ఐ‌టి మరియు పారిశ్రామిక రంగాలలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వలన ఆ రెండు రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందువలన ఉద్యోగ, ఉపాది అవకాశాలు గణనీయంగా పెరిగాయి.  

9. నిర్దేశించుకున్న గడువులోగానే మిషన్ భగీరధ, సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయబోతోంది.

10. ప్రజారోగ్యం, విద్యా, మౌలికావసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

11. కేసీఆర్‌ కిట్స్, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పధకాలకు సర్వత్రా ప్రశంశలు లభిస్తున్నాయి.

12. భూరికార్డులను సమూలంగా ప్రక్షాళన చేసి రైతులకు యాజమాన్యపు హక్కులను దృవీకరిస్తూ పాసుపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. అలాగే రిజిస్ట్రేషన్‌లో కూడా పూర్తి పారదర్శకత తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

13. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వలన రాబోయే 5 సం.లలో తెలంగాణ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దేశంలోనే నెంబర్: 1 స్థానంలో ఉంటుందని భావిస్తున్నాను.


Related Post