తెలంగాణ శాసనసభ స్పీకరుగా పోచారం ఏకగ్రీవ ఎన్నిక

January 18, 2019


img

ఈరోజు శాసనసభ సమావేశాలు మొదలవగానే తెలంగాణ శాసనసభ స్పీకరుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసిన తరువాత శాసనసభ్యులందరూ ఆయనను అభినందించారు. ఆనవాయితీ ప్రకారం సిఎం కేసీఆర్‌, ప్రధాన ప్రతిపక్షనేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, అహ్మద్ బలాలా ఆయనను స్పీకర్ కుర్చీ వరకు తోడ్కొని వెళ్లారు. ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 

పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్‌ జిల్లాలోని బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో ఆయన వ్యవసాయశాఖా మంత్రిగా పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో పాటు శాసనసభా వ్యవహారాలు, నియమనిబందనలపై మంచి అవగాహన, తెలుగు, ఉర్ధూ, ఇంగ్లీషుబాషలపై మంచి పట్టు  ఉన్నందున సిఎం కేసీఆర్‌ ఆయనను స్పీకర్‌గా చేయడానికే మొగ్గు చూపారు.    



Related Post