సీఎల్పీ పదవికోసం కాంగ్రెస్‌ నేతల పట్లు

January 17, 2019


img

మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. కానీ ఇంకా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత ఎన్నిక పూర్తికాలేదు. నిన్నరాత్రి గోల్కొండ హోటల్లో సమావేశమైన కాంగ్రెస్‌ కోర్ కమిటీ సభ్యులు దీని గురించి చర్చించినప్పటికీ, ఈరోజు అసెంబ్లీ కమిటీ హాలులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమైనప్పుడు సీఎల్పీ పదవికోసం పోటీ పడుతుండటంతో ఎన్నిక ఆలస్యం అవుతోంది.

ఈ పదవిని సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వాలని కాంగ్రెస్‌ కోర్ కమిటీ భావిస్తుండగా, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ పదవి తనకే ఇవ్వాలని పట్టుపడుతున్నారు. పార్టీలో ఎప్పుడూ కొందరు పెద్దలు వారి కుటుంబ సభ్యులకే పదవులు పంచుకొంటున్నారు తప్ప ఇతరులకు అవకాశమీయడం లేదని అన్నట్లు సమాచారం.

మరో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీఎల్పీ పదవిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పనిలోపనిగా రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు కూడా రాజగోపాల్ రెడ్డికి అప్పగిస్తే బాగుంటుందని కోరినట్లు సమాచారం. మరికొద్ది సేపటిలో సీఎల్పీ పదవి ఎవరికి దక్కుతుందో తేలిపోతుంది. కానీ పార్టీ గెలుపోటములతో సంబందం లేకుండా కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం ఆరాటం పడుతుండటమే విశేషం. 


Related Post