తెరాస ఎమ్మెల్యేలు భీమవరంలో సంక్రాంతి వేడుకలు

January 14, 2019


img

తెరాస ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, కొంతమంది హైదరాబాద్‌ నగర కార్పొరేటర్లు కలిసి ఈసారి సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో జరుపుకోబోతున్నారు. వారందరూ సోమవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన్న  భీమవరం చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం భీమవరంలోని సుప్రసిద్దం దేవాలయంలో మావురాలమ్మవారిని దర్శనం చేసుకొంటారు. రాత్రి భీమవరంలో గల తమ మిత్రుల ఇంట్లో బస చేస్తారు. రేపు ఉదయం జరుగబోయే సంక్రాంతి వేడుకలలో వారు కూడా పాల్గొంటారు. 

సంక్రాంతి వేడుకలలో కోడి పందేలుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అవి ఏ స్థాయిలో ఉంటాయో తెలుసుకోవాలంటే ఆంధ్రాలో ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో ఓసారి పర్యటించవలసిందే. కోడి పందేలు చట్టవ్యతిరేకం కనుక వాటిని హైకోర్టు కూడా నిషేదించింది. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులే స్వయంగా వాటిని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో జరుగుతున్న కోడి పందెలలో సుమారు రూ.2,000 కోట్లు పందేలు కాయబడ్డాయంటే అవి ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. వీటిలో పాల్గొనేందుకు విదేశాల నుంచి కూడా పందెంరాయుళ్ళు వస్తుండటం విశేషం కాగా తెరాస నేతలకు స్వాగతం పలుకుతూ భీమవరం రోడ్డు పొడవునా ఫ్లెక్సీ బ్యానర్లు కూడా ఏర్పాటు చేయబడటం మరో విశేషం. 



Related Post