మొదటి దశలో 340 పంచాయతీలు ఏకగ్రీవం

January 14, 2019


img

ఏకగ్రీవ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు, స్థానిక ఎమ్మెల్యేలు మరో 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించడంతో అనేక గ్రామాలలో ప్రజలు ఏకగ్రీవ పంచాయతీలకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా కొత్తగా పంచాయతీలుగా మారిన తండాలలో ప్రజలు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు అందిస్తున్న నగదు బహుమతులను దక్కించుకోవడానికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరుపుకొంటున్నారు. 

మొదటి దశ పంచాయతీ ఎన్నికలలో 340 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికవగా వాటిలో 310 పంచాయతీలలో గులాబీ జెండా ఎగిరింది. 

ఏకగ్రీవ పంచాయితీల వివరాలు: 

జిల్లా

పంచాయతీ

సర్పంచ్

కామారెడ్డి                 

మహమ్మద్‌నగర్

దఫేదార్ బాలమణి

 

నల్లమడుగు పెద్ద తండా

ధనావత్ రవీందర్

ఖమ్మం

తెల్దారుపల్లి

సిద్దినేని కోటయ్య

 

ముజ్జుగూడెం

బ్రహ్మ య్య

 

చిట్యాల తూర్పుతండా

పుల్జీన్ నాయక్‌

 

మేడేపల్లి

సామినేని రమేశ్

సంగారెడ్డి

గుడితండా

మెగావత్ లక్ష్మీబాయి

 

బ్యాతోల్‌

శిరీషకొండల్‌రెడ్డి            

 

పాశమైలారం

వై పోచయ్య               

 

చిట్కుల్‌

నీలం మధు

 

మాధుర

మాధవి

 

తెల్లరాళ్లతండా

రవీందర్‌నాయక్

 

దేవునిగుట్టతండా

అరుణ

 

చీక్‌మద్దూర్

శ్రీనివాస్‌రెడ్డి

 

మంగాపూర్

చిప్పల్‌తుర్తి యాదయ్య

 

కొత్తగూడెం

లకావత్‌మాధవి

 

గౌతాపూర్

ఖయ్యుంపాషా

 

దరఖాస్తుపల్లి

దూదేకుల మహ్మద్

రంగారెడ్డి

ఎక్లాస్‌ఖాన్‌పేట

ఎల్గనమోని కవిత

 

కొత్తతండా

కొర్ర దేవా

మెదక్ జిల్లాలో 28, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 30, వికారాబాద్ జిల్లాలో 6 గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయా పంచాయతీల ఎన్నికల అధికారులు ప్రకటించి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల చేత ప్రమాణస్వీకారాలు కూడా చేయించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేసి, త్వరలోనే వారి గ్రామాలకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇస్తున్నారు.    

Related Post