టిఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది: సుధీర్ రెడ్డి

January 12, 2019


img

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి రకరకాల ప్రచారాలు చేస్తూ మైండ్ గేమ్స్  ఆడుతుంటాయి. కానీ ఎన్నికలైన తరువాత కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ తమతో మైండ్ గేమ్స్ ఆడుతోందని ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు అయిన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, "నేను తెరాసలో  చేరుతున్నానంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తూ నాతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ మీడియాలో నాగురించి వస్తున్న ఆ వార్తలన్నీ అబద్దం. నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను," అని  సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. 

సుధీర్ రెడ్డి చెప్పినది నిజమే కావచ్చు కానీ ఇదివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరిన అనేకమంది నేతలు కూడా తమ గురించి మీడియాలో ఇటువంటి  వార్తలు వచ్చినప్పుడు వారు కూడా ఇలాగే వాటిని ఖండించి, ఆ తరువాత తెరాసలో చేరిపోయారు. కనుక సుధీర్ రెడ్డి తెరాసలో చేరుతారా లేదా అనే విషయం తెలియడానికి మరికొన్ని రోజులు  పడుతుంది. Related Post