133 ఏళ్ళ కాంగ్రెస్ కు 80 ఏళ్ళ బామ్మ ఆసరా!

January 10, 2019


img

133 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి 80 ఏళ్ళ వయసున్న షీలా దీక్షిత్‌ అవసరం పడింది. డిల్లీలో ఆమాద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కొలేకపోతున్నారు. మరోపక్క ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలను కూడా వారు ఎదుర్కోవలసివస్తోంది. కనుక మంచి రాజకీయ, పరిపాలనానుభవం ఉన్న షీలా దీక్షిత్‌కు డిల్లీ పార్టీ బాధ్యతలు అప్పగించి, ఆమెకు సహాయంగా దేవేందర్ యాదవ్, హారూన్ యూసఫ్, రాజేష్ లిలోటియాలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రాహుల్ గాంధీ నియమించారు. 

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నారు. కానీ క్రమంగా వయసు మీరిన షీలాదీక్షిత్ వంటివారికె బాధ్యతలు అప్పజెపుతుండటం విశేషం.  Related Post