సమ్మక్క-సారలమ్మవారిని దర్శించుకున్న కడియం

January 10, 2019


img

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వా యి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుదవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, “సమక్కసారలమ్మల దీవెనల వలననే మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్నాను. గత ఎన్నికల తరువాత 2016,18లో జరిగిన మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు, జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మా ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసింది. మళ్ళీ వచ్చే ఏడాది జరుగబోయే మేడారం జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాము. మేడారం అభివృద్ధికి సిఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలనాన్నిటినీ అమలుచేస్తాం. ఒక్క జాతర సమయంలోనే కాకుండా, ఏడాది పొడవునా భక్తులు అమ్మవార్లను దర్శించుకొనేందుకు వీలుగా అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి మేడారం జాతరను జాతీయపండుగాగా గుర్తించేలా చేస్తాం,” అని చెప్పారు. 

అలహాబాదులో జరిగే కుంభమేళా తరువాత దేశంలో మేడారం జాతర రెండవ అతిపెద్ద కుంభమేళాగా ప్రసిద్ది చెందింది.   రెండేళ్ళకోసారి జరిగే మేడారం జాతరకు లక్షలాది గిరిజనులు, లంబాడీలు తరలివస్తుంటారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలలో మేడారం జాతర జరుగుతుంది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రం నలుమూలల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మేడారంకు నిత్యం వందలాది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకొంటూనే ఉంటారు.


Related Post