ప్రజలు మావైపు... ఈవీఎంలు తెరాస వైపు: కాంగ్రెస్‌

December 14, 2018


img

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఓటమి షాక్ నుంచి తేరుకొని మెల్లగా మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు దాసోజు శ్రవణ్, సంపత్, మల్లు భట్టి విక్రమార్క, అద్దంకి దయాకర్ తదితరులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 

తెరాస ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయించి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని, సంపత్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం ఉంటే దీనిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 

 దాసోజు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి తెరాసకు పాలేరులాగ వ్యవహరించారని ఆరోపించారు. పోలింగుకు ముందు తెరాస విచ్చలవిడిగా డబ్బు మద్యం పంచిపెడుతుంటే కళ్లుమూసుకొని కూర్చోన్న రజత్ కుమార్, ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిర్వహించామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని దాసోజు ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో  ప్రజలంతా కాంగ్రెస్ పార్టీవైపు ఉంటే ఈవీఎంలు మాత్రం తెరాసవైపు ఉన్నాయని అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. బ్యాలెట్ పేపరుతో మళ్ళీ ఎన్నికలు నిర్వహించినట్లయితే, తెరాసకు ఎంత ప్రజాధారణ ఉందో తేటతెల్లమవుతుందని అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఎన్నికల సంఘం స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.


Related Post