మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌

December 14, 2018


img

తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల విజయం సాధించడంతో ఆ మూడు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవికి పార్టీ నేతలలో పోటీ మొదలైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ నేత కమల్‌నాథ్‌, యువనేత జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి పదవికి పోటీపడ్డారు. ఆ పదవిని యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు ఇవ్వాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావించగా, సోనియాగాంధీ కమల్‌నాథ్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించారు. నిన్న ఉదయం నుంచి రాత్రివరకు ఇదే అంశంపై వారు నలుగురు చర్చించిన తరువాత చివరికి సీనియర్ నేత కమల్‌నాథ్‌నే ముఖ్యమంత్రిగా నియమించాలనే సోనియాగాంధీ సూచనకు అంగీకారం తెలిపారు. కనుక గురువారం రాత్రి కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఇంకా ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఇదే రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి కనుక నేడు ఆ రెండు రాష్ట్రాల నేతలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చర్చించి ముఖ్యమంత్రులను ఖరారు చేసే అవకాశం ఉంది.        



Related Post