రేఖానాయక్ పరిస్థితి ఏమిటో?

November 20, 2018


img

ఖానాపూర్ తెరాస అభ్యర్ధి అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్‌కు ఎన్నికల సంఘం జలక్ ఇస్తుందా? అంటే అవుననే అనుకోవాలేమో? ఆమె సమర్పించిన మూడు నామినేషన్ సెట్స్ లో ఒక కోలంలో వివరాలు నింపలేకుండా సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారి కనుగొన్నారు. కనుక రేఖానాయక్ నామినేషన్‌పై జిల్లా కలెక్టర్ అభిప్రాయం కోరుతూ లేఖ వ్రాశారు. సాధారణంగా నామినేషన్ వేసే ముందే అభ్యర్ధులు ఒకటికి పదిసార్లు తపొప్పులు సరిచూసుకొంటారు. అయినప్పటికీ వాటిలో ఏవైనా పొరపాట్లు దొర్లితే రిటర్నింగ్ అధికారి వెంటనే ఆ విషయం సదరు అభ్యర్ధికి తెలియజేస్తుంటారు.

ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ మొదటిసారి కోదాడ నుంచి నామినేషన్ వేసినప్పుడు దానిలో కొన్ని తప్పులున్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో వేణు మాధవ్ వాటిని సరిదిద్ది మళ్ళీ నిన్న నామినేషన్ వేశారు. కానీ రేఖా నాయక్ నామినేషన్ మూడు సెట్లలో ఒక కోలమ్ నింపకుండా సమర్పించినప్పుడు రిటర్నింగ్ అధికారి కూడా దానిని గుర్తించకపోవడం ఆశ్చర్యమే. ఈవిషయం తెలుసుకొన్న కాంగ్రెస్‌ నేతలు రేఖా నాయక్ నామినేషన్ పత్రాలను తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కనుక దానిని నింపేందుకు రేఖా నాయక్‌కు ఈసీ అవకాశం ఇస్తుందా లేక నామినేషన్ పత్రంలో లోపం ఉన్న కారణంగా నిబందనల ప్రకారం ఆమె నామినేషన్ తిరస్కరిస్తారా చూడాలి.


Related Post