నేటితో ఒక అధ్యాయం ముగిసింది

November 19, 2018


img

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో మొదటి అధ్యాయం ముగిసింది. చివరి రోజైన ఈరోజు నామినేషన్లు వేసిన ప్రముఖులలో మంత్రులు కేటిఆర్‌, ఈటల, తుమ్మల, కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్‌రెడ్డి, జానారెడ్డి డికె.అరుణ, టిడిపి అభ్యర్ధి నామా నాగేశ్వర్ రావు తదితరులున్నారు. ఈరోజుతో నామినేషన్లకు గడువు ముగుస్తున్నందున, అనేక చిన్నాపెద్దా పార్టీల అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. రేపు అనగా మంగళవారం అభ్యర్ధుల నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం అధికారులు పరిశీలిస్తారు. బుద, గురువారాలలో అభ్యర్ధులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 5-6 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుంది. డిసెంబరు 7న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 11వ తేదీన ఓట్లు లెక్కింపు చేసి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.          Related Post