నేటితో నామినేషన్ల గడువు సమాప్తం

November 19, 2018


img

రాష్ట్రంలో అనూహ్యంగా ముందస్తు ఎన్నికలు రాగా చూస్తుండగానే రెండున్నర నెలలు ఇట్టే గడిచిపోయాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లు వేయడానికి గడువు పూర్తవుతుంది. తెరాస మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది. బిజెపి 117, కాంగ్రెస్‌ 94, టిడిపి-13, టిజేఎస్-14, సిపిఐ-3,మజ్లీస్-7 స్థానాలలో తమ అభ్యర్ధులను ప్రకటించాయి. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా నిన్నటివరకు మొత్తం 1497 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. 

చివరి రోజైన ఈరోజు అన్ని పార్టీలలో మిగిలిన స్థానాలకు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అలాగే స్వతంత్ర, రెబెల్ అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేయనున్నారు. రేపు ఎన్నికల సంఘం నామినేషన్ పత్రాల పరిశీలిస్తుంది. నవంబరు 21 నుంచి 22 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది. 


Related Post