ఆ రెండు నియోజకవర్గాలకు తెరాస అభ్యర్ధులు ఖరారు

November 19, 2018


img

తెరాస ఇప్పటి వరకు 117 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించగా మిగిలిన రెండు స్థానాలకు కూడా సిఎం కేసీఆర్‌ నిన్న అభ్యర్ధులను ఖరారు చేశారు. ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్, కోదాడ నుంచి బొల్లమ్ మల్లయ్య యాదవ్ పేర్లను ఖరారు చేశారు. ఈరోజు ఉదయం వారిరువురికీ బి-ఫారంలు అందజేయగానే వారు నామినేషన్లు వేస్తారు. 

కోదాడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఎన్.పద్మావతి రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా మల్లయ్య యాదవ్, సిపిఎం అభ్యర్ధిగా బర్రి శ్రీరాములు పోటీ చేస్తున్నారు. 

అలాగే ముషీరాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎం. అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు.         Related Post