టిజేఎస్ 14 స్థానాల్లో పోటీ?

November 19, 2018


img

మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న తెలంగాణ జనసమితికి కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు కేటాయించింది. కానీ టిజేఎస్ మాత్రం 14 స్థానాలలో పోటీ చేయడానికి సిద్దం అవుతుండటం విశేషం. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ నిన్న తమ కార్యాలయంలో ఏడుగురు అభ్యర్ధులకు బి-ఫారంలు అందజేశారు. మిగిలిన ఏడుగురికి ఈరోజు ఉదయం బి-ఫారంలు అందజేస్తామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియబోతోంది. కనుక టిజేఎస్ తో సహా అన్ని పార్టీలలో రెబెల్ అభ్యర్ధులలో ఎవరెవరు బరిలో దిగబోతున్నారనే విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది.   

బి-ఫారంలు అందుకొన్న తెలంగాణ జనసమితి అభ్యర్ధుల వివరాలు: 

మెదక్: జనార్ధన్ రెడ్డి, సిద్ధిపేట: భవానీ రెడ్డి, దుబ్బాక: రాజ్ కుమార్, మల్కాజ్ గిరి: కపిలవాయి దిలీప్ కుమార్, వరంగల్ తూర్పు: ఇన్నయ్య, మిర్యాలగూడ: విధ్యాధర్ రెడ్డి, మహబూబా నగర్: రాజేందర్ రెడ్డి. 

నేడు బి-ఫారంలు అందుకొనే అవకాశం ఉన్న అభ్యర్ధుల వివరాలు:

చెన్నూరు: దుర్గం నరేశ్, ఖానాపూర్: తట్ర భీం రావ్, వర్ధన్నపేట: దేవయ్య, స్టేషన్ ఘన్‌పూర్‌: చింతా స్వామి, ఆసిఫాబాద్: కె విజయ్. అశ్వారావు పేట: కె ప్రసాద్, అంబర్ పేట: అభ్యర్ధి ఖరారు చేయవలసి ఉంది.


Related Post